నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించడంపై ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్ష
- పరీక్షను ఆటంకాలు లేకుండా నిర్వహించాలని ఆదేశాలు
- పరీక్ష నిర్వహణలో సమగ్రత, పారదర్శకత అవసరమన్న కేంద్రమంత్రి
- పరీక్ష కేంద్రాల వద్ద అప్రమత్తత, భద్రతపై రాజీపడొద్దన్న కేంద్రమంత్రి
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ త్వరలోనే తిరిగి నిర్వహించనున్న నీట్ (యూజీ) పరీక్షపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ పరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష నిర్వహణలో సమగ్రత, పారదర్శకత అవసరాన్ని గుర్తు చేశారు. గత పరీక్షలో గుర్తించిన లోపాలను పరిష్కరించాలని సూచించారు.
మే 3న నీట్ పరీక్ష నిర్వహించగా, పేపర్ లీక్ కారణంగా ఆ పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించాలని ఎన్టీయే ప్రకటించడం తెలిసిందే.
ఈ క్రమంలో, నీట్ పరీక్షపై కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయ సమావేశాలు జరపాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద అప్రమత్తత, భద్రతపై రాజీపడవద్దని తెలిపారు.
నీట్ పరీక్ష పత్రం లీక్ కావడంపై సీబీఐ విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యార్థులు నష్టపోకూడదనే పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు తమకు మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు.