దేవుడిని రాజకీయాల్లోకి లాగడం బాధాకరం: వైఎస్ అవినాశ్ రెడ్డి

YS Avinash Reddy Criticizes Involving God in Politics
  • బోడపాడులో ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను అడ్డుకుంటున్నారన్న అవినాశ్
  • వైసీపీ నేతలను పీఎస్ చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్నారని మండిపాటు
  • దేవుడితో పెట్టుకుంటే నాశనం అవుతారని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం బోడపాడు గ్రామంలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బోడపాడు గ్రామంలో గత వారం రోజులుగా జరుగుతున్న ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను, సాంస్కృతిక ప్రదర్శనలను కూటమి ప్రభుత్వం పోలీసులు, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అడ్డుకుంటోందని ఆరోపించారు. గ్రామంలోని వైసీపీ నాయకులను వారం రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్నారని మండిపడ్డారు. 

దేవుడిని సైతం రాజకీయాల్లోకి లాగడం బాధాకరమని, దేవుడితో పెట్టుకుంటే నాశనం అవుతారని కూటమి నేతలు గ్రహించాలని హితవు పలికారు. భవిష్యత్తులో ప్రతి విషయానికి కూటమి నాయకులు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని అవినాశ్ రెడ్డి హెచ్చరించారు. 
Go Back to Shorts
YS Avinash Reddy
Andhra Pradesh
Kootami Government
YSRCP
Kadapa District
Brahhmamgari Matham
Anjaneya Swamy Brahmotsavam
Political Criticism

More Telugu News