రేపు చంద్రబాబు కావలి పర్యటన షెడ్యూల్ ఇదిగో!

Chandrababu Naidu Kavali visit schedule
  • నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
  • 'మత్స్యకార సేవలో' కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
  • తుమ్మలపెంట గ్రామంలో బహిరంగ సభ, నిధుల విడుదల
  • మత్స్యకార కుటుంబాలతో భేటీ, టీడీపీ శ్రేణులతో సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకారుల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. వేట నిషేధ కాలంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా మత్స్యకారులను ఆదుకునేందుకు అమలు చేస్తోన్న ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద వరుసగా రెండో ఏడాది ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేయనుంది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో జరిగే  కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొని, మత్స్యకార కుటుంబాలతో ముఖాముఖి భేటీ కానున్నారు.

అధికారిక షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి ఉదయం 9:30 గంటలకు అమరావతిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరుతారు. ఉదయం 10:30 గంటలకు కావలి మండలం తుమ్మలపెంట గ్రామానికి చేరుకుంటారు. ఉదయం 10:45 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయనున్నారు. 

మధ్యాహ్నం 1:15 గంటలకు తుమ్మలపెంట గ్రామంలోని మత్స్యకార కుటుంబాలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమవుతారు. వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ శ్రేణులతో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ముగించుకుని సాయంత్రం 4:45 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
Matsyakara scheme
Fishermen welfare
Kavali
Tummala Penta
Nellore district
AP government
Financial assistance
Fisheries

More Telugu News