చెలరేగిన రాజస్థాన్ టాపార్డర్.. ఢిల్లీ టార్గెట్ 194

17-05-2026 Sun 21:41 | Sports
Advertisement
  • ఢిల్లీ క్యాపిటల్స్‌కు 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన రాజస్థాన్ రాయల్స్
  • హాఫ్ సెంచరీలతో రాణించిన రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్
  • విజృంభించి ఆడిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ
  • నాలుగు వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇచ్చిన మిచెల్ స్టార్క్
Advertisement
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ టాపార్డర్ చలవతో భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు నమోదు చేసింది. 

రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రియాన్ పరాగ్ (26 బంతుల్లో 51), ధ్రువ్ జురెల్ (40 బంతుల్లో 53) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ముఖ్యంగా పరాగ్ తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆరంభంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ ముగ్గురి దూకుడుతో రాజస్థాన్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు పడగొట్టినప్పటికీ, 40 పరుగులు సమర్పించుకుని ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. అయితే ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి రాజస్థాన్ జోరుకు కొంత బ్రేక్ వేశాడు. లుంగి ఎంగిడి (2/24), మాధవ్ తివారీ (2/27) పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సొంత మైదానంలో ఈ భారీ లక్ష్యాన్ని ఢిల్లీ ఎలా ఛేదిస్తుందో వేచి చూడాలి.
Advertisement
Riyan ParagRajasthan RoyalsDelhi CapitalsIPL 2024Dhruv JurelVaibhav SuryavanshiMitchell StarcArun Jaitley StadiumCricketT20

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more