శాంతి చర్చలు.. ఇరాన్‌ ముందు అమెరికా ఐదు కఠిన షరతులు

  • యుద్ధ నష్టపరిహారం ఇవ్వబోమని స్పష్టం
  • 400కిలోల యురేనియం ఇవ్వాలని డిమాండ్
  • స్తంభించిన నిధుల విడుదలకు నిరాకరణ
  • ఇరాన్‌ సైతం ఐదు షరతులు
  • పరహారం ఇవ్వాల్సిందేనని పట్టు
ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల్లో అమెరికా ఐదు కఠిన షరతులు విధించింది. ఇప్పటి వరకు ఇరాన్‌కు జరిగిన నష్టాలకు ఎలాంటి పరిహారం చెల్లించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ఓ నివేదికను విడుదల చేసింది.

ఇరాన్ తన వద్ద ఉన్న 400 కిలోల శుద్ధిచేసిన యురేనియంను తమకు అప్పగించాలని అమెరికా డిమాండ్ చేసింది. అలాగే ఇరాన్‌లోని అణు కేంద్రాల్లో కేవలం ఒక్కదానికి మాత్రమే అనుమతి ఇస్తామని పేర్కొంది. విదేశాల్లో స్తంభించిపోయిన ఇరాన్ ఆస్తుల్లో కనీసం 25 శాతాన్ని కూడా విడుదల చేయబోమని తెలిపింది. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల ముగింపు ఈ చర్చల పురోగతిపైనే ఆధారపడి ఉంటుందని అమెరికా లింక్ పెట్టింది. 

ఈ ఐదు షరతులకు ఇరాన్ అంగీకరించినా అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ముప్పు అలాగే కొనసాగుతుందని వైనెట్ న్యూస్ అభిప్రాయపడింది. మరోవైపు ఇరాన్ కూడా చర్చల కోసం ఐదు షరతులను విధించింది. ముఖ్యంగా లెబనాన్‌లో ఘర్షణలు ఆపాలని, తమపై ఆంక్షలు ఎత్తివేయాలని, స్తంభించిన నిధులను విడుదల చేయాలని కోరింది. యుద్ధ నష్టపరిహారంతో పాటు హర్మూజ్‌ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని డిమాండ్ చేసింది.

Iran
Iran Nuclear Deal
US Iran Relations
Enriched Uranium
Hormuz Strait
Israel
Nuclear Program
Sanctions
Middle East Conflict

More Telugu News