బండి భగీరథ్ కేసులో మేడ్చల్ కోర్టుకు హాజరైన బాధితురాలు
- మేజిస్ట్రేట్ ఎదుట స్టేట్‌మెంట్ ఇచ్చిన బాధితురాలు
- ఇప్పటికే రెండుసార్లు వాంగ్మూలం ఇచ్చిన బాధితురాలు
- తాజాగా బాధితురాలితో పాటు తల్లి స్టేట్‌మెంట్ రికార్డు
బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బాధితురాలు తన తల్లితో కలిసి మేడ్చల్ కోర్టుకు హాజరై, మేజిస్ట్రేట్ ఎదుట స్టేట్‌మెంట్ ఇచ్చింది. బాధితురాలు ఇప్పటికే రెండుసార్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. తాజాగా, బాధితురాలితో పాటు తల్లి స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డు చేశారు.
తన కుమార్తెకు బలవంతంగా మద్యం ఇచ్చి, బలహీనస్థితిలో ఉన్న సమయంలో బండి భగీరథ్ ఒత్తిడి చేసి అనుచితంగా ప్రవర్తించాడని తల్లి ఇప్పటికే ఆరోపణలు చేశారు. అతని కారణంగా తన కూతురు చాలా రోజులుగా మానసిక వేదనకు గురైందని అన్నారు. ఈ వ్యవహారంలో ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగుతోందని, నిజానిజాలు తప్పకుండా బయటకు వస్తాయని ఆమె అన్నారు. తమ వద్ద వాట్సాప్ చాటింగ్‌లు, మెసేజ్‌లు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు.