విజయ్ చాలా సరదాగా ఉంటారు: మాళవిక మోహనన్

Malavika Mohanan says Vijay is very fun
  • విజయ్ తో కలిసి నటించిన జ్ఞాపకాలను పంచుకున్న మాళవిక
  • ప్రతి చిన్న విషయంపై విజయ్ దృష్టి పెట్టి నటిస్తారని వెల్లడి
  • స్టార్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్న మాళవిక

టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస క్రేజీ ఆఫర్లు అందుకుంటూ హీరోయిన్ మాళవిక మోహనన్ దూసుకుపోతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ 'మాస్టర్' సినిమా షూటింగ్ జ్ఞాపకాలను ఆమె ఈ సందర్భంగా పంచుకున్నారు.


'మాస్టర్' సినిమా మొదటి రోజు షూటింగ్‌లోనే తనకు చాలా కష్టమైన సీన్ ఎదురైందని, దానివల్ల తన ఫోకస్ మొత్తం డైలాగ్స్‌పైనే పెట్టాల్సి వచ్చిందని మాళవిక తెలిపారు. అయితే, విజయ్ మాత్రం ఎంతటి కష్టమైన సీన్ అయినా సరే.. ఎంతో ప్రశాంతంగా (కూల్‌గా), ప్రతి చిన్న విషయంపై దృష్టి పెడుతూ నటిస్తారని ఆమె కొనియాడారు. సెట్స్‌లో ఆయన అందరితో చాలా సరదాగా ఉంటారని చెప్పారు. 


మోహన్ లాల్, రజనీకాంత్, విజయ్ వంటి సీనియర్ మోస్ట్ సూపర్ స్టార్ల నుంచి ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నానని మాళవిక వెల్లడించారు. ముఖ్యంగా వారి టైమ్ మేనేజ్‌మెంట్, క్రమశిక్షణ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ఉదయం 7 గంటలకు షూటింగ్ అని చెబితే.. వారు ఉదయమే 6.55 కల్లా సెట్స్‌లో హాజరవుతారని స్పష్టం చేశారు. అంతటి పెద్ద స్టార్స్ సమయపాలన పాటించడం వల్లే ఇండస్ట్రీలో నిర్మాతలకు భారీగా డబ్బు వృథా కాకుండా ఉంటుందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Go Back to Shorts
Malavika Mohanan
Vijay
Master Movie
Tamil Cinema
Kollywood
Tollywood
Mohanlal
Rajinikanth
Tamil Nadu CM
Movie Shooting

More Telugu News