అభిమానులకు షాక్.. టిక్కెట్ ధరలను రెండింతలు పెంచిన సన్‌రైజర్స్

  • 22వ తేదీన ఉప్పల్ వేదికగా ఎస్ఆర్‌హెచ్, ఆర్సీబీ మ్యాచ్
  • రూ.950 టిక్కెట్ ధర రూ.2 వేలకు పెంపు
  • కార్పొరేట్ బాక్స్ టిక్కెట్ ధర రూ.45 వేలకు పెంపు
అభిమానులకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) షాకిచ్చింది. ఎస్ఆర్‌హెచ్ ఐపీఎల్ టిక్కెట్ల ధరలను భారీగా పెంచింది. ఈ నెల 22వ తేదీన ఉప్పల్ వేదికగా ఎస్ఆర్‌హెచ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం డిస్ట్రిక్ట్ యాప్‌లలో టిక్కెట్ల కోసం బుకింగ్ మొదలైంది. టిక్కెట్ల ధరలను రెండింతలకు పైగా పెంచడం గమనార్హం.

రూ.950 టిక్కెట్ ధరను రూ.2 వేలకు, రూ.1,500 టిక్కెట్ ధరను రూ.3 వేలకు, రూ.1,910 టిక్కెట్ ధరను రూ.3,500కు, రూ.2,500 టిక్కెట్ ధరను రూ.4,500కు పెంచారు. అలాగే రూ.4,500 టిక్కెట్ ధరను రూ.6 వేలకు, రూ.7 వేల టిక్కెట్ ధరను రూ.10 వేలకు, రూ.23 వేల బాక్స్ టిక్కెట్ ధరను రూ.30 వేలకు, రూ.30 వేల కార్పొరేట్ బాక్స్ టిక్కెట్ ధరను రూ.45 వేలకు పెంచారు.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ మూడో స్థానంలో ఉంది. టోర్నీలో ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడిన ఎస్ఆర్ హెచ్ 7 విజయాలు నమోదు చేసింది. 




Sunrisers Hyderabad
SRH
IPL 2024
IPL tickets
Uppal Stadium
Royal Challengers Bangalore
RCB

More Telugu News