కొంతమంది యువత బొద్దింకల్లాంటి వాళ్లు: సీజేఐ సూర్యకాంత్

  • సీనియర్ అడ్వోకేట్ హోదాను కోరుతున్న న్యాయవాదిని మందలిస్తున్న సమయంలో సీజేఐ వ్యాఖ్య
  • ఉద్యోగాలు లేని యువత సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారని ఆందోళన
  • వ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు సమాజంలో ఉన్నారని వ్యాఖ్య
భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కొంతమంది నిరుద్యోగ యువతను బొద్దింకలతో' పోల్చారు. కొంతమంది బొద్దింకల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేని యువత సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి, వ్యవస్థపై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

సీనియర్ అడ్వకేట్ హోదాను కోరుతున్న ఒక న్యాయవాదిని మందలిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు సమాజంలో ఇప్పటికే ఉన్నారని, వారితో చేతులు కలపాలనుకుంటున్నారా? అంటూ పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది.

సీనియర్ న్యాయవాదుల హోదాకు సంబంధించిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయడంలో ఢిల్లీ హైకోర్టు జాప్యం చేస్తోందని, ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది సంజయ్ దూబే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సీనియర్ అడ్వోకేట్ హోదా అనేది కోర్టు ప్రసాదించే విశిష్ట గౌరవమని పేర్కొంది. వ్యాజ్యాల ద్వారా దానిని సాధించుకోలేరని స్పష్టం చేసింది.

సీనియర్ హోదాను మీకు తప్ప ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వవచ్చని పేర్కొంది. ఒకవేళ హైకోర్టు మీకు ఆ హోదా ఇచ్చినా మీ ప్రవర్తనను చూసి మేం దానిని పక్కన పెడతామని సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. పిటిషనర్ సామాజిక మాధ్యమ వేదికగా ఉపయోగించిన భాషను సీజేఐ ప్రస్తావించారు. న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని వచ్చే పోస్టులు తమ దృష్టికి వస్తున్నాయని పేర్కొన్నారు. విచారణ సమయంలో పిటిషనర్ కోర్టుకు క్షమాపణలు చెప్పి, పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటానని అనుమతి కోరారు. అందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.

Surya Kant
CJI Surya Kant
Chief Justice of India
unemployed youth
social media
RTI activists

More Telugu News