వాళ్లు ముగ్గురు 75 ఏళ్ల కుర్రాళ్లు... వాళ్లది పవర్ ఫుల్ కాంబో: మంత్రి నారా లోకేష్
- పుట్టపర్తిలో ఏఎంసీఏ స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌కు భూమిపూజ
- మోదీ, రాజ్ నాథ్, చంద్రబాబు 75 ఏళ్ల కుర్రాళ్లు అంటూ లోకేష్ ప్రశంసలు
- వారిలో 25 ఏళ్ల యువకులు ఉన్నారని, వారి స్పీడ్ తట్టుకోలేమన్న లోకేష్
- రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఐరన్ మ్యాన్‌గా అభివర్ణన
పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్టు భూమిపూజ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో కలిసి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్ర మారబోతోందని లోకేష్ అన్నారు. రక్షణ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు రానున్నాయని, యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, పాకిస్థాన్‌కు గట్టి జవాబిచ్చిన 'ఆపరేషన్ సిందూర్'ను గుర్తుచేస్తూ, దాని వెనుక ఉన్న అసలైన శక్తి, ఐరన్ మ్యాన్ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అని లోకేష్ ప్రశంసించారు. ఈ కార్యక్రమం ద్వారా ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.