గృహహింస కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

  • ముందస్తు బెయిల్ దాఖలు చేసిన నిందితుడు
  • నిందితుడు మద్యం మత్తులో భార్యపై దాడి చేశాడని ఆరోపణలు
  • బెయిల్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
భార్యను ఏ భర్త కూడా పశువులా చూడకూడదని, ఆమెకు గౌరవంతో జీవించే సర్వ హక్కులు ఉన్నాయని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ గృహహింస కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. గృహహింస ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. అనంతరం అతడి అభ్యర్థనను తోసిపుచ్చింది. అంతకుముందు పాట్నా హైకోర్టు కూడా అతని బెయిల్‌ను తిరస్కరించింది.

నిందితుడు మద్యం మత్తులో భార్యపై దాడి చేశాడని బాధితురాలు తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నేలపైకి తోయడంతో ఇటుక తగిలి ఆమె తలకు గాయమైందని అన్నారు. ఆ తర్వాత కర్రతోనూ దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు మూడు వివాహాలు చేసుకున్నాడని కోర్టుకు తెలిపారు. ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాధితురాలు అతడి మొదటి భార్య.

బాధితురాలి వాదనలు విన్న న్యాయస్థానం, "మీరు మీ భార్యను ఎందుకు కొట్టాలనుకున్నారు? ఇలాగే వేధిస్తే ఆమె మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది కదా. మీరు రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండి" అని సూచించింది. నిందితుడి ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది.

Domestic Violence Case
Supreme Court
Indian Law
Wife Abuse
Patna High Court
Assault
Victim Rights

More Telugu News