రేపు ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు

Chandrababu Naidu to Visit Delhi Tomorrow
  • కేంద్ర మంత్రులతో భేటీ కానున్న ముఖ్యమంత్రి
  • సీఐఐ బిజినెస్ సమ్మిట్ కు హాజరు కానున్న చంద్రబాబునాయుడు
  • రేపు రాత్రికి ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి ఉదయం 11.30 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తోనూ సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించమన్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచబ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్ లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్ కు ఆయన హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్ధిక సలహా మండలి చైర్మన్ ఎస్. మహేంద్రదేవ్ సహా నీతిఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. రేపు రాత్రికి ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
AP CM Delhi Visit
Amit Shah
Jal Shakti Ministry
CR Patil

More Telugu News