అమెరికా, ఇరాన్ యుద్ధం... చమురు కంపెనీలకు రూ.30 వేల కోట్ల నష్టం

Oil Companies Suffer Losses Due to Iran Israel War
  • యుద్ధానికి ముందు 70 డాలర్లుగా ఒక బ్యారెల్ ముడి చమురు ధర
  • ఇప్పుడు 100 డాలర్లు పలుకుతున్న వైనం
  • అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ భారత్‌లో మాత్రం స్థిరంగా ధరలు
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నాయి. అయితే మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు యథాతథంగా ఉన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ముడిసరుకు ధర ఒక దశలో యాభై శాతం పెరిగింది. కానీ మన వద్ద చమురు కంపెనీలు ధరలను స్థిరంగా కొనసాగించాయి. దీంతో చమురు కంపెనీలకు రూ.30 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఒక బ్యారెల్ ముడి చమురు ధర 70 డాలర్ల వద్ద ఉండగా, ప్రస్తుతం 100 డాలర్లకు పైగా పలుకుతోంది. ఒక దశలో 144 డాలర్లకు కూడా చేరుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇంధన సరఫరాను నిరంతరాయంగా కొనసాగించాయి.

అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయ చముర రంగ సంస్థలు పెంచకపోవడంతో ఈ మూడు కంపెనీలు రూ.30 వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయి. కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్‌పై లీటర్‌కు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో నష్టాలు రూ.62,500 కోట్ల నుంచి రూ.30 వేల కోట్లకు తగ్గాయి.

అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరకు అదనంగా మరికొన్ని ఖర్చులను భరించాల్సి వచ్చింది. రవాణా నౌకలను దారి మళ్లించడం, బీమా ప్రీమియాలు పెరగడం వంటి ఖర్చులు జత కలిశాయి. 
Advertisement
Iran
Iran Israel war
America Iran war
Oil prices
Crude oil
Petrol prices
Diesel prices
Indian Oil Corporation

More Telugu News