ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆయన విధించిన 10శాతం ప్రపంచవ్యాప్త సుంకాలను రద్దు చేసిన కోర్టు
- ఈ సుంకాలు చట్ట ప్రకారం సమంజసం కావని స్పష్టం చేసిన న్యాయస్థానం
- చిన్న వ్యాపార సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై అనుకూలంగా తీర్పు
- 1974 నాటి వాణిజ్య చట్టాన్ని తప్పుగా ఉపయోగించారని కోర్టు వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వాణిజ్య న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రపంచవ్యాప్తంగా వివిధ వస్తువులపై విధించిన 10శాతం సుంకాలను యూఎస్ అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం కొట్టివేసింది. ఈ సుంకాలు చట్ట ప్రకారం సమంజసం కావని గురువారం కీలక తీర్పు ఇచ్చింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వచ్చిన ఈ సుంకాలను సవాల్ చేస్తూ పలు చిన్న వ్యాపార సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. వాటి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం 2-1 మెజారిటీతో పిటిషనర్లకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. వాణిజ్య చెల్లింపుల లోటును సరిదిద్దడానికి 1974 నాటి వాణిజ్య చట్టాన్ని ఉపయోగించడం సరైన చర్య కాదని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.
గతంలో 2025లో 'అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం' కింద ట్రంప్ విధించిన సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ తీర్పును తప్పించుకునేందుకే ట్రంప్ మరో చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఈ కొత్త సుంకాలను విధించారని పిటిషనర్లు తమ వాదనలు వినిపించారు. వాణిజ్య చెల్లింపుల్లో తీవ్ర లోటును సరిదిద్దడానికి 150 రోజుల వరకు సుంకాలను విధించేందుకు వీలు కల్పించే 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122ను ట్రంప్ ఉపయోగించారు. అయితే, ప్రస్తుత వాణిజ్య లోటుకు ఆ చట్టాన్ని వర్తింపజేయడం సరికాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ తీర్పుతో చిన్న వ్యాపార సంస్థలకు పెద్ద ఊరట లభించినట్లయింది.