ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్ పురస్కారం

Anand Rk and Suparna Sharma win Pulitzer Prize
  • పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పురస్కారం
  • ఆనంద్ ఆర్కే, సుపర్ణాశర్మలను వరించిన పులిట్జర్
  • డిజిటల్ నిఘా, సైబర్ నేరాలను వెలుగులోకి తెచ్చినందుకు పురస్కారం
ఇద్దరు భారతీయ జర్నలిస్టులను ప్రఖ్యాత పులిట్జర్ పురస్కారం వరించింది. పాత్రికేయ రంగంలో దీనిని అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదిగా భావిస్తారు. డిజిటల్ నిఘా, సైబర్ మోసాలను విస్తృతంగా వెలుగులోకి తెచ్చినందుకు ఆనంద్ ఆర్కే, సుపర్ణాశర్మలు ఈ అవార్డును దక్కించుకున్నారు. ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్, కామెంటరీ విభాగం కింద దీనిని ప్రకటించారు.

ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్‌కు చెందిన నటాలీ ఒబికో పియర్సన్‌తో కలిసి వీరిద్దరు ఈ అవార్డును పంచుకోనున్నారు. పులిట్జర్ బోర్డు సోమవారం న్యూయార్క్‌లో విజేతలను ప్రకటించింది. విజువల్ రిపోర్టింగ్, వ్యాఖ్యానం విభాగంలో వారు దీనిని గెలుచుకున్నట్లు పులిట్జర్ వెబ్ సైట్ పేర్కొంది. కొలంబియా యూనివర్సిటీ ఈ అవార్డును అందిస్తుంటుంది.

బ్లూమ్ బర్గ్‌లో 'ట్రాప్డ్' అనే శీర్షికతో ప్రచురితమైన పరిశోధనాత్మక రిపోర్టులో సాంకేతికతను వినియోగించి మోసగాళ్లు, సామాన్యులను ఎలా ట్రాప్ చేస్తున్నారో, వారికి ఎదురయ్యే ప్రమాదాలను ప్రపంచానికి చాటిచెప్పింది. ఫోన్ ద్వారా డిజిటల్ అరెస్టుకు గురైన భారతదేశంలోని ఒక న్యూరాలజిస్ట్ గురించి చెబుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పెరుగుతున్న నిఘా, డిజిటల్ మోసాల సవాళ్లను కళ్లకు కట్టినట్లు ఈ పరిశోధనాత్మక రిపోర్టు వివరించింది.
Advertisement
Anand Rk
Pulitzer Prize
Indian Journalists
Digital Surveillance
Cyber Frauds
Suparna Sharma

More Telugu News