కేరళలో వామపక్ష పాలనకు తెర.. కాంగ్రెస్ కూటమి ఘన విజయం

Kerala Assembly Elections Congress UDF Wins Ending Left Rule
  • కేరళలో పదేళ్ల వామపక్ష పాలనకు ముగింపు
  • కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి స్పష్టమైన మెజారిటీ
  • దేశంలో కమ్యూనిస్టుల పాలనలో ఉన్న చివరి రాష్ట్రం కూడా పరాజయం
  • ప్రభుత్వ వ్యతిరేకతే ఎల్డీఎఫ్ ఓటమికి కారణమని విశ్లేషణ
  • కొన్ని కీలక స్థానాల్లో గెలిచి ఉనికి చాటుకున్న బీజేపీ
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ల వామపక్ష పాలనకు తెరపడింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) చారిత్రాత్మక విజయం సాధించింది. పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వంపై ప్రజలు స్పష్టమైన వ్యతిరేక తీర్పు ఇచ్చారు. ఈ ఫలితంతో దేశంలో కమ్యూనిస్టుల పాలనలో ఉన్న చివరి రాష్ట్రం కూడా వారి చేజారినట్లయింది.

మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ప్రభుత్వం ఏర్పాటుకు 71 సీట్లు అవసరం కాగా, యూడీఎఫ్ కూటమి 102 స్థానాలతో తిరుగులేని విజయం అందుకుంది. మరోవైపు, అధికార ఎల్డీఎఫ్ కూటమి 35 స్థానాలతో సరిపెట్టుకుంది. ఎన్డీయే కూటమి 3 చోట్ల గెలిచి ఉనికిని చాటుకుంది. ఏప్రిల్ 9న ఎన్నికలు జరగగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలే ఎల్డీఎఫ్ ఓటమికి ప్రధాన కారణాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ విజయంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ.. ఎల్డీఎఫ్ ప్రభుత్వ అహంకారం, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పు ఇదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ.. తాము ఊహించిన దానికంటే గొప్ప విజయం లభించిందని అన్నారు. ఫలితాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు యూడీఎఫ్ సన్నాహాలు చేస్తోంది.
Go Back to Shorts
Pinarayi Vijayan
Kerala Assembly Elections
UDF Victory
LDF Defeat
Kerala Politics
Congress
Communists
KC Venugopal
Shashi Tharoor

More Telugu News