బెంగాల్‌లో ఈవీఎం ట్యాంపరింగ్ రగడ.. 15 కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభం
- ఈవీఎం బటన్లపై టేపులు అంటించి.. ఇంకు చల్లారని ఆరోపణలు
- టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీకి పట్టున్న ప్రాంతంలో ఘటన
- ఫాల్టా నియోజకవర్గంలోని మరో 30 బూత్‌లపైనా ఈసీ సమీక్ష
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎం) ట్యాంపరింగ్ ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపడంతో కేంద్ర ఎన్నికల సంఘం 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశించింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్, మగ్రాహత్ పశ్చిమ్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ రీపోలింగ్ ప్రక్రియ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ పోలింగ్ సందర్భంగా ఈవీఎంల బటన్లపై బ్లాక్ టేప్, జిగురు, ఇంకు, పర్ఫ్యూమ్ వంటివి అంటించి ఓటర్లను గందరగోళానికి గురిచేశారని, తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయకుండా అడ్డుకున్నారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా బీజేపీ, సీపీఎం అభ్యర్థుల పేర్లు, గుర్తులు కనిపించకుండా చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మొత్తం 77 ఫిర్యాదులు అందగా, వీటిని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా మగ్రాహత్ పశ్చిమ్‌లో 11, డైమండ్ హార్బర్‌లో 4 బూత్‌లలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఈ వివాదం టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి రాజకీయంగా పట్టున్న డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో జరగడం గమనార్హం. అత్యధికంగా ఫాల్టా నియోజకవర్గంలో 32 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ ఆరోపణలకు సంబంధించి బీజేపీ నేతలు కొన్ని వీడియోలను కూడా ప్రచారంలో పెట్టారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 58(2) ప్రకారం పాత పోలింగ్‌ను రద్దు చేసి తాజా పోలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఫాల్టా నియోజకవర్గంలో రీపోలింగ్‌పై ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఇక్కడి మరో 30 పోలింగ్ కేంద్రాలపై కూడా సమీక్ష జరుగుతోందని, త్వరలోనే తుది నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది. ఈ వివాదాల నడుమ కూడా బెంగాల్‌లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యధికంగా 92.93 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం.