కొండచిలువ చెట్టు ఎక్కే విధానం చూశారా... పోలవరం జిల్లాలో అరుదైన దృశ్యం!

Python tries to climb a tree visuals went viral
  • పోలవరం జిల్లాలో కలకలం రేపిన భారీ కొండచిలువ
  • చెట్టును చుట్టుకుంటూ పైకి ఎగబాకిన అరుదైన దృశ్యం
  • భయంతోనే వీడియోలు చిత్రీకరించిన స్థానిక ప్రజలు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొండచిలువ వీడియో
సాధారణంగా పాములు నేలపై పాకుతూ వెళ్తాయి. కానీ, ఓ భారీ కొండచిలువ ఏకంగా చెట్టును చుట్టుకుంటూ పైకి ఎగబాకి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన శరీరాన్ని చెట్టు కాండానికి స్పింగ్‌లా చుట్టి, ఒత్తిడిని ఉపయోగించి పైపైకి వెళుతున్న దాని విన్యాసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అరుదైన దృశ్యం పోలవరం జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, అడ్డతీగల సమీపంలో నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. రంపచోడవరం-అడ్డతీగల జాతీయ రహదారి పక్కనే ఉన్న టేకు తోటలో పనిచేస్తున్న కొందరు వలస కూలీలు ఈ భారీ కొండచిలువను మొదట గుర్తించారు. అది ఓ టేకు చెట్టుకు చుట్టుకుని పైకి ఎగబాకుతుండటంతో ఆశ్చర్యపోయారు. వెంటనే స్థానికులకు సమాచారం అందించారు.

దీంతో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు, అంత పెద్ద పామును చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొందరు ధైర్యం చేసి టార్చ్‌లైట్ల వెలుగులో తమ మొబైల్ ఫోన్లతో ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. చెట్టును పట్టుకుని, శరీరాన్ని బిగిస్తూ అది పైకి వెళ్తున్న తీరు వీడియోలో స్పష్టంగా రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా కొండచిలువ చెట్టెక్కే విధానమే నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటోంది.
Go Back to Shorts
Python
Tree Climbing
Video
Polavaram District

More Telugu News