అషు రెడ్డి కేసులో సంచలన విషయాలు.. ఆత్మహత్య బెదిరింపులు
- అషు రెడ్డి చుట్టూ హనీ ట్రాప్ ఆరోపణలు
- తన నుంచి రూ. 9.35 కోట్ల వరకు లాగేసిందంటూ ధర్మేంద్ర ఫిర్యాదు
- డబ్బు అడిగినప్పుడల్లా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని వెల్లడి
టాలీవుడ్ నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అషు రెడ్డి చుట్టూ అల్లుకున్న ‘హనీ ట్రాప్’ ఆరోపణల ఉదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అషు గురించి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధర్మేంద్ర పలు సంచలన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా తాను ఇచ్చిన డబ్బును అడిగినప్పుడల్లా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేందని ఆయన కీలక విషయానని తెలియజేశారు.
పెళ్లి చేసుకుంటాననే సాకుతో అషు రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు తనను నిలువునా ముంచారని ధర్మేంద్ర ఆరోపించారు. 2018 నుంచి 2025 వరకు సాగిన ఈ వ్యవహారంలో ఆస్తులు, నగదు రూపంలో సుమారు రూ. 9.35 కోట్లు కాజేసినట్లు పోలీసుల ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
ప్రారంభంలో తన ఎడ్యుకేషన్ లోన్, వీసా సమస్యలు, సినీ కెరీర్ ఖర్చుల పేరుతో అషు రెడ్డి తన నుంచి భారీగా డబ్బు తీసుకున్నట్లు ధర్మేంద్ర తెలిపారు. ధర్మేంద్ర ఇచ్చిన డబ్బుతో అషు రెడ్డి మణికొండలో ఒక ఫ్లాట్ (రూ. 1.80 కోట్ల అడ్వాన్స్), సుమారు 5 కిలోల బంగారం, ఖరీదైన కార్లు కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
డబ్బులు తిరిగి అడిగినప్పుడల్లా తాను ఆత్మహత్య చేసుకుంటానని అషు రెడ్డి బెదిరించేదని, గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేసిందని బాధితుడు వెల్లడించారు. ఈ ఆరోపణలను అషు రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఖండించారు. తనపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.