తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. వడదెబ్బకు ముగ్గురు మృతి

Telangana
Advertisement
  • తెలంగాణను దహిస్తున్న ఎండలు
  • ఆదిలాబాద్‌లో రికార్డు స్థాయిలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత
  • వడదెబ్బకు గురై రాష్ట్రంలో ముగ్గురు రైతుల మృతి
  • మరో రెండు రోజులు పెరగనున్న ఎండలు.. ఆ తర్వాత వర్షాలు
  • అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిక
Advertisement
తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. అడవుల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్ ఇప్పుడు నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఆదివారం ఇక్కడ రికార్డు స్థాయిలో ఏకంగా 45.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 3.5 డిగ్రీలు అధికం కావడం గమనార్హం. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల మార్కును దాటాయి. పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

ఈ ఎండల తీవ్రతకు రాష్ట్రంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో మాదినేని ఆరోగ్య బాబు (57) అనే రైతు పొలం పనులకు వెళ్లి వడదెబ్బకు గురై అక్కడికక్కడే మరణించారు. ఇదే తరహాలో నల్గొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన ఎన్. యాదయ్య (56), సూర్యాపేట జిల్లా రాఘవపురానికి చెందిన రావుల వేలాద్రి (60) కూడా వ్యవసాయ పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి ప్రాణాలు విడిచారు. మధ్యాహ్న సమయాల్లో రైతులు, కూలీలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం రాబోయే రెండు రోజులు (ఇవాళ‌, రేపు) ఉష్ణోగ్రతలు ఇంకా 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఎండల తీవ్రత మరింత అధికం కానుంది. అయితే, ఈ భగభగల నుంచి ఉపశమనం కలిగించేలా వర్ష సూచన కూడా ఉంది. సోమవారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవవచ్చని ఐఎండీ తెలిపింది. ఈ నెల‌ 29 నుంచి మే 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. వేపుళ్లు, మసాలా పదార్థాలకు దూరంగా ఉండి, తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

TelanganaHeatwaveIMD

More Telugu News

ఆఫీసులో దీపావళి డ్యాన్స్.. ఒక్క వీడియోతో ఇంటర్నెట్ స్టార్‌గా మారిన యువ‌తి!

03 Nov, 14:36

పెడన మున్సిపల్ చైర్మన్ గా జనసేన అభ్యర్థి జ్యోత్స ఘన విజయం

03 Nov, 14:31

మురసు తుపాను: వచ్చే 4-5 గంటలు కీలకం.. యంత్రాంగానికి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

03 Nov, 14:22

టెలికాం కంపెనీలకు ట్రాయ్ కొత్త రూల్స్.. కొత్త ఏడాది నుంచి అమ‌లు

03 Nov, 14:20

‘మనమంతా ఒకే గాలి పీలుస్తున్నాం’.. దియా మిర్జా దీపావళి వీడియో వివాదంపై హైకోర్టు ఆగ్రహం

03 Nov, 14:16

హార్లీ డేవిడ్‌సన్‌ 'స్ప్రింట్‌ 440' ఆవిష్కరణ.. ఆరు గేర్లు, 34 కి.మీ మైలేజీ

03 Nov, 13:52

నిరసన స్థలాన్ని శాశ్వతంగా ఆక్రమించలేరు.. వ్యాపార నష్టాలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

03 Nov, 13:39

ఐపీఎల్‌లో భారీ ట్రేడ్: పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

03 Nov, 13:21

పిఠాపురం మున్సిపాలిటీలో జనసేన హవా.. ఒక స్థానంలో టీడీపీ రెబెల్ గెలుపు!

03 Nov, 13:13

వివో నుంచి కొత్త క్లిప్‌ ఇయర్‌బడ్స్‌.. 42 గంటల బ్యాటరీ బ్యాకప్‌!

03 Nov, 13:07

అమ్మా తీసుకెళ్లు అంటూ గుండెలు పిండేసిన చిన్నారి.. చివరికి తల్లిదండ్రుల చెంతకు!

03 Nov, 13:04

40 దాటాక పరుగెత్తొచ్చా? నిపుణులు చెబుతున్నది ఇదే..!

03 Nov, 12:54

కుప్పం ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద హై టెన్షన్.. రంగంలోకి పోలీసులు

03 Nov, 12:52

కివీస్ గడ్డపై సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ.. కావాల్సింది 139 పరుగులే!

03 Nov, 12:44

ప్రపంచంలోనే అత్యధిక మంచు కురిసే నగరం ఇదే!

03 Nov, 12:41
..More Telugu News