Advertisement

సీఎం చంద్రబాబు పాత వీడియో వైరల్.. ఎంత చెప్పినా మారట్లేదని మంత్రి లోకేశ్‌ ఆగ్ర‌హం

Nara Lokesh Slams YSRCP for False Propaganda Against Chandrababu Naidu
  • సీఎం చంద్రబాబు పాత వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్
  • ఉద్యోగం అడిగిన యువకుడికి ఆటో ఇస్తామన్నట్లు తప్పుడు ప్రచారం
  • ఇది వైసీపీ పనేనంటూ మంత్రి నారా లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం
  • రెండు వేర్వేరు సంఘటనలను కలిపి వీడియో ఎడిట్ చేశారని స్పష్టీక‌ర‌ణ‌
  • ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించిన పాత వీడియో ఒకటి మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానన్నట్లుగా ఎడిట్ చేసిన ఈ వీడియోపై మంత్రి నారా లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని, ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

విషయం ఏమిటంటే.. మార్చి 30న నాయుడుపేట పర్యటనలో సీఎం చంద్రబాబు లబ్ధిదారురాలైన అంబిక ఇంటికి వెళ్లారు. ఆమె భర్త ఆటో డ్రైవర్‌ కావడంతో అతనికి బ్యాటరీ ఆటో కొనివ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు మరో మహిళ తన చదువుకున్న కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని కోరారు. అయితే, కొందరు ఈ రెండు వేర్వేరు సంఘటనలను కలిపి, ఉద్యోగం అడిగితే చంద్రబాబు ఆటో కొనిస్తానని హామీ ఇచ్చినట్లుగా తప్పుడు అర్థం వచ్చేలా వీడియోను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారు.

ఈ దుష్ప్రచారంపై మంత్రి లోకేశ్‌ స్పందిస్తూ... "వైసీపీ తన పాత అలవాటు మార్చుకోవడం లేదు. నాయుడుపేటలో రెండు వేర్వేరు సందర్భాల్లో జరిగిన విషయాలను కలిపి, సీఎంపై అపహాస్యం చేసేలా వీడియోను సృష్టించారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు. ఈ వీడియోపై గతంలోనే ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం వివరణ ఇచ్చిందని, అయినప్పటికీ మళ్లీ అదే వీడియోతో దుష్ప్రచారం చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు.
Advertisement
Nara Lokesh
Chandrababu Naidu
AP CM
YSRCP
Fake Video
Andhra Pradesh Politics
Narayana Pet
AP Fact Check

More Telugu News