శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. రేవంత్ సర్కార్ చేసిన హత్య: కేటీఆర్

  • ఈ ఉదయం మృతి చెందిన శంకర్ గౌడ్
  • పార్థివదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు అనుమతించకపోవడం దుర్మార్గమన్న కేటీఆర్
  • అరెస్ట్ చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన 'హత్య' అని ఆయన అన్నారు. శంకర్ గౌడ్ పార్థివదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులు అర్పించేందుకు కూడా అనుమతించకపోవడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. అరెస్టు చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహా కార్మిక నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


కుటుంబ పెద్దను కోల్పోయిన శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ఒకేరోజు ముగ్గురు ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యాయత్నం చేయడం తెలంగాణ చరిత్రలో ఒక 'చీకటి రోజు' అని, అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని, బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని, ప్రభుత్వ మెడలు వంచి హక్కులు సాధించుకుందామని పిలుపునిచ్చారు.

KTR
BRS
RTC Strike

More Telugu News