రామ్ చరణ్ ను కలిసిన 'వాళా 2' టీమ్
- మలయాళ బ్లాక్‌బస్టర్ 'వాళా 2' తెలుగులో రిలీజ్
- రామ్ చరణ్ ను కలిసిన చిత్రబృందం
- సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సాహు గారపాటి, అర్చన
- షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై తెలుగులో విడుదల కానున్న చిత్రం
- దర్శకుడు విపిన్ దాస్, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మలయాళంలో భారీ విజయం సాధించిన 'వాళా 2' చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాను రేపు (ఏప్రిల్ 24) తెలుగులోనూ విడుదల చేస్తుండటంతో, చిత్ర బృందానికి ఆయన మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇవాళ 'వాళా 2' టీమ్ పెద్ది సెట్స్ పై రామ్ చరణ్ ను కలిసింది.
దీనిపై రామ్ చరణ్ స్పందిస్తూ, "'వాళా 2' టీమ్‌ను కలవడం చాలా ఆనందంగా ఉంది. మలయాళంలో భారీ విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను తెలుగు వారికి అందిస్తున్న నిర్మాతలు సాహు గారపాటి, అర్చనలకు నా అభినందనలు" అని పేర్కొన్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాను విస్తృత ప్రేక్షకులకు పరిచయం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ ప్రాజెక్టు వెనుక కీలక శక్తిగా ఉన్న దర్శకుడు విపిన్ దాస్, మరో దర్శకుడు సావిన్ ఎస్ఏతో పాటు, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌కు, యువ చిత్ర బృందానికి రామ్ చరణ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.