పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. స్కూళ్లలో 'వాటర్ బెల్'తో ఢిల్లీ ప్రభుత్వం వినూత్న ఆలోచన

Delhi schools to ring hourly water bell
  • వేసవి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం కోసం ఢిల్లీ ప్రభుత్వం మార్గదర్శకాలు
  • విద్యార్థులు నీరు త్రాగాలని గుర్తు చేయడానికి ప్రతి గంటకు ఒకసారి బెల్ మోగించాలని సూచన
  • తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, విద్యార్థుల భద్రత అధికారులకు ప్రధాన ఆందోళనగా మారింది. ఎండ వేడి సంబంధిత ప్రమాదాలను తగ్గించడానికి, వేసవి తీవ్రత ఎక్కువగా ఉండే రోజులలో పిల్లల భద్రత కోసం ఢిల్లీ పాఠశాలలు ఇప్పుడు తక్షణ చర్యలు చేపడుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్యం కోసం ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు మార్గదర్శకాలను జారీ చేసింది.

పిల్లల్లో డీహైడ్రేషన్, వేడి సంబంధిత అనారోగ్యాలను నివారించడానికి ముందుజాగ్రత్త చర్యలను అమలు చేయాలని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం, ఈ వేసవి కాలంలో విద్యార్థులకు నీరు త్రాగాలని గుర్తు చేయడానికి ప్రతి 45 నిమిషాల నుంచి 60 నిమిషాలకు గంట మోగించాలి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో, విద్యార్థులు క్రమం తప్పకుండా నీటిని తీసుకునేలా ఢిల్లీ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది.

అలాగే, విద్యార్థులను గ్రూపులుగా చేసి, ఒకరి యోగక్షేమాలను మరొకరు తెలుసుకునేలా బడ్డీ సిస్టంను ప్రవేశపెట్టింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున, మార్నింగ్ అసెంబ్లీని రద్దు చేసింది లేదా వాటిని తక్కువ సమయంలో పాఠశాల లోపల నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ తరగతులను నిషేధించింది. పాఠశాలల్లో వెలుపల నిర్వహించే ఫిజికల్ యాక్టివిటీస్‌ను కూడా నిలిపివేయాలని ఆదేశించింది. పాఠశాలల్లో నిత్యం చల్లని తాగునీరు అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

ఢిల్లీ ప్రభుత్వం తల్లిదండ్రులు, విద్యార్థులకు కూడా సూచనలు చేసింది. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించింది. ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ విషయాన్ని పంచుకోవాలని తెలిపింది. వడగాల్పు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించింది. తమ పిల్లలను తేలికైన గాలి సులభంగా ఆడే కాటన్ దుస్తుల్లో పాఠశాలకు పంపించాలని ప్రభుత్వం తల్లిదండ్రులకు సూచించింది.
Advertisement
Delhi schools to ring hourly water bell
heatwave dehydration

More Telugu News