సైన్స్ చంద్రుడిపైకి.. నమ్మకం స్వర్గానికి తీసుకెళతాయి : పూరి జగన్నాథ్ కొత్త పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర విశ్లేషణ
- "సైన్స్ అండ్ బిలీఫ్" అనే అంశంపై పూరి జగన్నాథ్ కొత్త పాడ్‌కాస్ట్
- ప్రపంచాన్ని శాస్త్రబద్ధంగా చూడాలి కానీ నమ్మకాలతో కాదని సూచన
- మనిషి ఆలోచనలు, భావోద్వేగాలు జీవశాస్త్ర ప్రక్రియలేనని వ్యాఖ్య
- ప్రూఫ్, డేటా లేకుండా దేన్నీ గుడ్డిగా నమ్మవద్దని స్పష్టీకరణ
సినీ ఇండస్ట్రీలో 26 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా, ‘పూరి మ్యూజింగ్స్’ పాడ్‌కాస్ట్‌లో "సైన్స్ అండ్ బిలీఫ్" అనే అంశంపై డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేసిన విశ్లేషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రపంచాన్ని మూఢ నమ్మకాలతో కాకుండా శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకోవాలని ఆయన బలంగా వాదించారు.
"ఏదైనా విషయాన్ని పరిశీలన, పరీక్షలు, ఆధారాలతో నిరూపించేది సైన్స్. ప్రూఫ్, డేటా, ఎక్స్‌పెరిమెంట్స్ లేకుండా దేన్నీ గుడ్డిగా నమ్మకండి" అని పూరి స్పష్టం చేశారు. చేతిలో నుంచి జారిన వస్తువు గ్రావిటీ వల్లే కింద పడుతుంది కానీ, నమ్మకాల వల్ల కాదని ఒక చిన్న ఉదాహరణతో సైన్స్ ప్రాముఖ్యతను వివరించారు. సైన్స్ ఎప్పటికప్పుడు తనను తాను సరిదిద్దుకుంటూ పురోగమిస్తుందని, కానీ నమ్మకాలు, సంప్రదాయాలు మాత్రం మారకుండా ఒకేచోట స్థిరంగా ఉంటాయని అన్నారు.
మనిషి జీవితం, ఆలోచనలు, ప్రేమ, భయం వంటి భావోద్వేగాలు కూడా పూర్తిగా బయోలాజికల్ ప్రక్రియలేనని పూరి వివరించారు. ఇవన్నీ మెదడు, న్యూరాన్లు, బయోకెమిస్ట్రీ వల్ల కలిగేవేనని తెలిపారు. మనిషి అనేవాడు ఒక్కరోజులో పుట్టలేదని, బిలియన్ల సంవత్సరాల పరిణామ క్రమం ఫలితమని గుర్తుచేశారు. అందుకే స్కూళ్లు, కాలేజీల్లో నేర్పే సైన్స్‌ను విశ్వసించాలని, సమాజంలో వినిపించే ప్రతిదాన్నీ నమ్మవద్దని సూచించారు.
సమాజంలో సైంటిఫిక్ థింకింగ్ పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని పూరి అభిప్రాయపడ్డారు. "ఎవరైనా దెయ్యం ఉందని చెబితే, దానికి ఎవిడెన్స్ ఏదని ప్రశ్నించండి. ఆధారాలు లేకపోతే ఆ విషయాన్ని పెండింగ్‌లో పెట్టండి" అని సలహా ఇచ్చారు. భూమి బల్లపరుపుగా ఉందని ఇప్పటికీ నమ్మే వారు ఉన్నారని, అందుకే లాజికల్ థింకింగ్ చాలా ముఖ్యమని అన్నారు. చివరగా "సైన్స్ మిమ్మల్ని చంద్రమండలానికి తీసుకెళ్తే.. నమ్మకం మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళుతుంది" అంటూ తనదైన శైలిలో తన మాటలను ముగించారు.