ఇక ఆరు రోజులే... చివరి దశకు రామ్ చరణ్ 'పెద్ది' షూటింగ్
- అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు సానా
- తనకు స్ఫూర్తినిచ్చిన పాత్ర పెద్ది అని దర్శకుడు బుచ్చిబాబు వెల్లడి
- రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న చిత్రం
- పహిల్వాన్‌గా రామ్ చరణ్
- హీరోయిన్ గా జాన్వీ కపూర్... ఏఆర్ రెహమాన్ సంగీతం
- జూన్‌లో సినిమాను విడుదల
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్ చివరి అంకానికి చేరుకుంది. ఈ సినిమా చిత్రీకరణ మరో 6 రోజుల్లో పూర్తవుతుందని దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా వెల్లడించారు. రామ్ చరణ్‌తో సెట్స్‌లో దిగిన సెల్ఫీని పంచుకుంటూ, "నాకు అత్యంత స్ఫూర్తినిచ్చిన పాత్ర.. నేను ప్రేమించే పెద్ది" అంటూ ఆయన తన అభిమానాన్ని చాటుకున్నారు.
పాన్-ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఒక రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. ఇందులో రామ్ చరణ్ 'పెద్ది' అనే టైటిల్ రోల్‌లో, మునుపెన్నడూ చూడని రఫ్ అండ్ రస్టిక్ అవతార్‌లో పహిల్వాన్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం చరణ్ ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. ఆయన సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమాలోని టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని, కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని చిత్రబృందం ప్రకటించింది. ఇప్పుడు ఆ చివరి పాట చిత్రీకరణ కూడా ముగింపు దశకు రావడంతో, పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసి, సినిమాను 2026 జూన్‌లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.