పెద్దదస్తగిరి హత్య కేసు.. వైసీపీ నేత నిత్యానందరెడ్డి నివాసంలో సోదాలు

పెద్దదస్తగిరి హత్య కేసు.. వైసీపీ నేత నిత్యానందరెడ్డి నివాసంలో సోదాలు

kadapa Ycp worker pedda dastagiri Murder case
  • కడప వైసీపీ కార్యకర్త దస్తగిరి హత్య కేసులో కీలక పురోగతి
  • ప్రధాన సూత్రధారిగా మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి కోసం గుర్తింపు
  • రూ.100 కోట్ల విలువైన ఆస్తుల వివాదమే కారణమని వెల్లడి
  • పరారీలో ఉన్న నిత్యానంద రెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
కడపలో సంచలనం సృష్టించిన వైసీపీ కార్యకర్త పెద్దదస్తగిరి హత్య కేసు విచారణలో కీలక పురోగతి లభించింది. ఈ హత్య వెనుక రూ.100 కోట్లకు పైగా విలువైన రియల్ ఎస్టేట్ వివాదాలు ఉన్నాయని పోలీసులు తేల్చారు. వైసీపీ నేత, కడప మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు నిర్ధారించి, ఆయన కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు, నిత్యానంద రెడ్డిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన దేశం విడిచి పారిపోకుండా పోలీసులు లుక్అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. దస్తగిరి హత్య తర్వాత ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా, 145 భూములకు సంబంధించిన కీలక పత్రాలు లభించాయి. ఈ డాక్యుమెంట్ల విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కాగా, నిత్యానంద రెడ్డి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను తీవ్రతరం చేసిన పోలీసులు గత రాత్రి నాలుగు గంటల పాటు ఆయన నివాసంలో సోదాలు జరిపారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Advertisement
kadapa
Ycp worker
Pedda Dastagiri case
police investigation
Nityananda Reddy

More Telugu News