ఛత్తీస్గఢ్ కొండల్లో చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ప్రైవేట్ జెట్
- ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జష్పూర్ జిల్లాలో ప్రమాదం
- పైలట్, కోపైలట్ మృతి
- సంఘటన స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జష్పూర్ జిల్లా కొండల్లో సోమవారం ఒక ప్రైవేటు జెట్ విమానం చెట్టును ఢీకొట్టి కుప్పకూలింది. అటవీ ప్రాంతంలో ఒక చెట్టును ఢీకొనడంతో ఇది కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ ఇద్దరూ చనిపోయారు. ఘటనాస్థలంలో మంటలు ఎగిసిపడటంతో పొగ దట్టంగా అలుముకుంది.
ఈ ప్రైవేటు జెట్ విమానంలో ఎంతమంది ప్రయాణించారనే విషయం తెలియాల్సి ఉంది. ఈ జెట్లో ప్రయాణికులు ఉన్నారా లేదా అనే విషయాన్ని అధికారులు నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఉన్నతాధికారులు ఘటనస్థలానికి చేరుకున్నారు.