మహిళా రిజర్వేషన్ పేరిట బీజేపీ మాయోపాయం పారలేదు: షర్మిల

YS Sharmila Slams BJPs Tactics on Womens Reservation
  • వీగిపోయింది డీలిమిటేషన్ బిల్లేనని, మహిళా బిల్లు కాదని వ్యాఖ్య
  • విపక్షాలు మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకం కాదని స్పష్టీకరణ
  • 2023లో ఆమోదం పొందిన బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్
  • 543 లోక్‌సభ స్థానాల్లో 33 శాతం కోటా వర్తింపజేయాలని సూచన
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో బీజేపీ కుతంత్రాలకు పాల్పడిందని, అయితే వారి మాయోపాయం ఫలించలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఇది ఎన్డీఏ అధర్మంపై ఇండియా కూటమి సాధించిన ధర్మయుద్ధ విజయమని, ప్రజాస్వామ్యం నిలబడిందని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా షర్మిల స్పందిస్తూ... "విఫలమైంది అతి గతి లేని డీలిమిటేషన్ బిల్లే తప్ప, మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు. మహిళా బిల్లుకు 2023లోనే ఆమోదం లభించింది. విపక్షాలు ఎన్నడూ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రను మాత్రమే ప్రతిపక్షాలు తిప్పికొట్టాయి" అని స్పష్టం చేశారు.

మహిళల పేరుతో నీచ రాజకీయాలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి ఇది చెంపపెట్టు లాంటిదని ఆమె ఘాటుగా విమర్శించారు. సాధికారత పేరుతో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయాలనే బీజేపీ కుయుక్తులు చెల్లలేదని అన్నారు. ఇది భారతదేశ ప్రజల విజయమని, బీజేపీ రాజకీయ దురుద్దేశానికి ఇది చరమ గీతమని అభివర్ణించారు.

ప్రతిపక్షాలపై బురదజల్లడం మాని, మహిళలపై చిత్తశుద్ధి ఉంటే 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. దేశంలోని 543 లోక్‌సభ స్థానాల్లో వెంటనే 33 శాతం రిజర్వేషన్లు కల్పించి, తమ నిజాయతీని నిరూపించుకోవాలని బీజేపీకి సవాల్ విసిరారు.
Go Back to Shorts
YS Sharmila
Andhra Pradesh Congress
মহিলা Reservation Bill
BJP Politics
Narendra Modi
INDIA Alliance
Women Empowerment
Lok Sabha Elections
Political News
Reservation Policy

More Telugu News