ఇరాన్‌తో యుద్ధంలో రూ.2 వేల కోట్లకు పైగా విలువైన నిఘా డ్రోన్‌ను నష్టపోయిన అమెరికా
- ఈ నెల 9న హర్మూజ్ జలసంధి వద్ద ఘటన
- నిఘా డ్రోన్‌ను నష్టపోయినట్లు ధృవీకరించిన అమెరికా
- సాంకేతిక లోపం కారణంగానే కూలిపోయినట్లు వెల్లడి
ఇరాన్‌తో జరుగుతోన్న యుద్ధంలో అమెరికా రూ.2,222 కోట్ల (238 మిలియన్ డాలర్లు) విలువైన నిఘా డ్రోన్‌ను నష్టపోయింది. ఈ నెల 9వ తేదీన హర్మూజ్ జలసంధి వద్ద ఈ ఘటన జరగగా, దీనిని అమెరికా నేవీ కూడా ధృవీకరించింది. అయితే ఈ నిఘా డ్రోన్ సాంకేతిక లోపం కారణంగానే కూలిపోయినట్లు వెల్లడించింది. ఎంక్యూ-4సీ ట్రైటాన్ పేరున్న దీనిపై ఎటువంటి దాడి జరగలేదని తెలిపింది.
అంతర్జాతీయ గగనతలంలో హర్మూజ్ వద్ద ట్రైటాన్ గస్తీలో ఉండగా, అకస్మాత్తుగా ఎమర్జెన్సీ కోడ్‌ను రిలీజ్ చేసినట్లు అమెరికా తెలిపింది. ఆ తర్వాత 50 వేల అడుగుల ఎత్తు నుంచి 10 వేల అడుగుల ఎత్తుకు దిగి వచ్చింది. ఆ తర్వాత అదృశ్యమైంది. అయితే ఈ ప్రమాదం ఏ ప్రాంతంలో జరిగిందో అమెరికా వెల్లడించలేదు. మిలియన్ డాలర్లకు పైగా నష్టం, ఎయిర్ క్రాఫ్ట్ పూర్తిగా ధ్వంసమైన నేపథ్యంలో, అమెరికా నేవీ సేఫ్టీ కమాండ్ దీనిని క్లాస్-ఏ ప్రమాదంగా వర్గీకరించింది.