చంచల్‌గూడ జైల్లో బాల్క సుమన్‌ను కలిసిన కేటీఆర్

KTR meets Balka Suman in Chanchalguda jail
  • సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలంటూ బాల్క సుమన్ వ్యాఖ్యలు
  • చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సుమన్
  • కేటీఆర్‌తో పాటు జైలుకు వెళ్లిన తలసాని, సుధీర్ రెడ్డి

చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ములాఖత్‌లో కలిశారు. కేటీఆర్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి కూడా బాల్క సుమన్‌ను పరామర్శించిన వారిలో ఉన్నారు. జైల్లో ఉన్న సుమన్‌కు పార్టీ పూర్తి అండగా ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ భరోసా ఇచ్చారు.


అసలు కేసు నేపథ్యం ఏంటి?

సింగరేణి కాలరీస్ ఆస్తులను ధ్వంసం చేయాలంటూ, రైలు పట్టాలు కోసేయాలంటూ బాల్క సుమన్ ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయనపై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. గడిచిన మే 26న తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ.. సింగరేణి కాలరీస్‌కు చెందిన జూనియర్ అసిస్టెంట్ ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ అరెస్ట్ చర్యలు చేపట్టారు.

Advertisement
KTR
Talasani
Balka Suman
BRS

More Telugu News