గుడ్‌న్యూస్.. ఎట్టకేలకు కేరళను తాకిన రుతుపవనాలు
- మూడు రోజులు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశం
- దేశవ్యాప్త వర్షాకాలానికి ఆరంభం
- రైతుల్లో కొత్త ఆశలు
- జులై మధ్య నాటికి దేశమంతటా విస్తరించే అవకాశం
- దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే వార్త
భారత్‌లో వ్యవసాయ రంగం ఎక్కువగా వర్షాలపైనే ఆధారపడి సాగుతోంది. మొత్తం సాగవుతున్న భూమిలో దాదాపు 51 శాతం ప్రాంతానికి ఈ రుతుపవన వర్షాలే ప్రధాన ఆధారం. కోట్లాది మంది ప్రజల జీవనోపాధి, గ్రామీణ ప్రాంతాల ఆదాయం ఈ వానలపైనే ఆధారపడి ఉన్నాయి. రుతుపవనాలు సకాలంలో వస్తేనే పంటల దిగుబడి పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంటాయి. వర్షాల వల్ల గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, దేశ ఆర్థిక వృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
కేరళను తాకిన ఈ రుతుపవనాలు రాబోయే రోజుల్లో దశలవారీగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. జులై మధ్య నాటికి దేశం మొత్తాన్ని కమ్ముకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే కొన్ని వారాల పాటు ఇవి ఎంత వేగంగా ముందుకు సాగుతాయనేది చాలా కీలకంగా మారనుంది.