ప్రశాంత్ నీల్ కి జూనియర్ ఎన్టీఆర్ గ్రీటింగ్స్

Junior NTR greetings to Prashanth Neel
  • నేడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు
  • పుట్టినరోజు శుభాకాంక్షలు డైరెక్టర్ గారూ అంటూ ఎన్టీఆర్ ట్వీట్
  • మన భవిష్యత్తు ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వ్యాఖ్య

ఇండియన్ సినిమా రేంజ్‌ను మార్చిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా అగ్ర క‌థానాయ‌కుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంత్ నీల్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని, అలాగే వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోయే ‘డ్రాగ‌న్’ (Dragon)ను గుర్తుచేస్తూ ఎన్టీఆర్ పెట్టిన ఒక క్రేజీ పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్‌గా మారింది.


ఈ ట్వీట్‌లో ఎన్టీఆర్ స్పందిస్తూ.. “పుట్టినరోజు శుభాకాంక్షలు డైరెక్టర్ గారూ.. మీరు చెప్పే కథలంత గొప్పగా ఈ ఏడాది మీకు సాగాలని కోరుకుంటున్నాను. మన కాంబినేషన్‌లో రాబోయే ప్రాజెక్ట్ కోసం, మన భవిష్యత్తు ప్రయాణం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను ప్రశాంత్" అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌లో ప్రశాంత్ నీల్‌ను ఉద్దేశించి ఎన్టీఆర్ కన్నడ పదం ‘అవరే’ (అంటే తెలుగులో గారూ అని అర్థం) అని సంబోధించడం ఇటు తెలుగు, అటు కన్నడ భాషల అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.


‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి భారీ ఇండస్ట్రీ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాబోయే ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. థియేటర్లలో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అప్‌డేట్ ఎన్టీఆర్ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

Go Back to Shorts
Junior NTR
Prashanth Neel
Tollywood
Bollywood

More Telugu News