Advertisement

ఆశా భోంస్లే మనవరాలిని ఓదార్చిన క్రికెటర్ సిరాజ్... వీడియో ఇదిగో!

Mohammed Siraj Consoles Asha Bhosles Granddaughter
  • ఆశా భోంస్లే అంత్యక్రియల ముందు భావోద్వేగబరిత దృశ్యం
  • సోదరి సమానురాలైన జనాయ్ కన్నీటిపర్యంతం కావడంతో అండగా నిలబడ్డ పేసర్
  • అంత్యక్రియల్లో భావోద్వేగానికి గురైన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్
  • ఐపీఎల్ మ్యాచ్‌లో మౌనం పాటించి నివాళులర్పించిన ఆటగాళ్లు
  • ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన ఆశా భోంస్లే అంత్యక్రియలు
దిగ్గజ గాయని ఆశా భోంస్లే అంత్యక్రియల ముందు భావోద్వేగభరిత దృశ్యం చోటుచేసుకుంది. ఆమె మనవరాలు జనాయ్ భోంస్లేను టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఓదారుస్తూ కనిపించాడు. ఆశా భోంస్లేకు నివాళులర్పించేందుకు ఆమె నివాసానికి చేరుకున్న సిరాజ్‌ను చూడగానే జనాయ్ కన్నీటిపర్యంతమైంది. సిరాజ్‌పై వాలిపోయి ఆమె దుఃఖిస్తున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి. ఈ కష్టకాలంలో సిరాజ్ ఆమెకు అండగా నిలిచి ఓదార్చాడు. వీరిద్దరి మధ్య అన్నాచెల్లెళ్ల వంటి ఆత్మీయ బంధం ఉంది. గతంలో వీరిద్దరి స్నేహంపై ఊహాగానాలు రాగా, సిరాజ్ తనకు సోదరుడి లాంటివాడని జనాయ్ స్పష్టం చేసింది. అప్పట్లో సిరాజ్ కు ఆమె రాఖీ కూడా కట్టింది.

వివరాల్లోకి వెళితే, ఏప్రిల్ 12న బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కన్నుమూసిన గానకోకిల ఆశా భోంస్లే అంత్యక్రియలు సోమవారం ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు క్రికెట్ ప్రపంచం తరలివచ్చింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో కలిసి హాజరయ్యారు. ఆశా భోంస్లేను తన పెద్ద అక్కలా భావించే సచిన్, అంత్యక్రియల సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ఆశా భోంస్లే మృతి పట్ల క్రికెట్ ప్రపంచం కూడా ఘనంగా నివాళులర్పించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌కు ముందు ఒక నిమిషం మౌనం పాటించారు. ముంబై ఆటగాళ్లు ఆమెకు గౌరవ సూచకంగా నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. లతా మంగేష్కర్‌తో పాటు ఆశా భోంస్లే కూడా భారత క్రికెట్‌కు పెద్ద అభిమాని అన్న విషయం తెలిసిందే.
Advertisement
Mohammed Siraj
Asha Bhosle
Janai Bhosle
Sachin Tendulkar
Indian Cricket
Cricket
Mumbai Indians
IPL 2026
Condolence
Sister

More Telugu News