టీడీపీ క్యాడర్ తో చంద్రబాబు కాఫీ కబుర్లు... ఫొటోలు ఇవిగో!

Chandrababu Naidu Holds Coffee Chat With TDP Cadre
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 'కాఫీ కబుర్లు' పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలకు రాజకీయ, పరిపాలనా అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాజకీయాల్లో నిజాయతీగా ఉంటేనే విలువ ఉంటుందని, ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు చేయాలి కానీ జీవనోపాధిగా ఎంచుకోకూడదని ఆయన హితవు పలికారు. క్లీన్ పాలిటిక్స్‌కు టీడీపీని కేరాఫ్ అడ్రస్‌గా మార్చాలని దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "నాడు ఐటీతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్టే, నేడు క్వాంటం టెక్నాలజీతో ఏపీని, అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. ఈ నెల 14న క్వాంటం టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభిస్తాం" అని వెల్లడించారు. గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచిందని, తమ ప్రభుత్వం ఛార్జీలను తగ్గిస్తోందని స్పష్టం చేశారు. సోలార్ విద్యుత్ వినియోగంపై ఫీడ్‌బ్యాక్ తీసుకోగా, తమ విద్యుత్ బిల్లుల భారం తగ్గిందని పలువురు కార్యకర్తలు ముఖ్యమంత్రికి తెలిపారు.

సమగ్ర నీటి నిర్వహణ ద్వారా ప్రాజెక్టులను నింపామని, మే 15 నాటికే పంటలకు నీరు అందిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రతి కులానికి దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం, ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు.
Go Back to Shorts
Chandrababu Naidu
TDP
Telugu Desam Party
Andhra Pradesh
Mangalagiri
Quantum Technology
Amaravati
Clean Politics
Solar Power
Water Management

More Telugu News