టీ20ల్లో బాబర్ ఆజం ప్రపంచ రికార్డ్.. గేల్, కోహ్లీలను దాటేశాడు!
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 12,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో భాగంగా కరాచీలో జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీ తరఫున ఆడుతూ బాబర్ ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనతను సాధించడానికి బాబర్‌కు కేవలం 338 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరం కావడం విశేషం.
ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం, 'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ 343 ఇన్నింగ్స్‌లలో 12,000 పరుగుల మార్కును చేరుకున్నాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 360 ఇన్నింగ్స్‌లతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు వారందరినీ వెనక్కి నెట్టి బాబర్ ఆజం అగ్రస్థానంలో నిలిచాడు. కాగా, టీ20 ఫార్మాట్‌లో 12,000 పరుగుల క్లబ్‌లో చేరిన రెండో పాకిస్థాన్ బ్యాటర్‌గా బాబర్ గుర్తింపు పొందాడు. సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ పాక్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ఉన్నాడు.
కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు అందుకోవడానికి బాబర్‌కు కేవలం 13 పరుగులు అవసరం కాగా, జల్మీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే దీనిని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన బాబర్ కేవలం 51 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఆటగాడు కుశాల్ మెండిస్‌తో కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 191 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. బాబర్ మెరుపులతో పెషావర్ జల్మీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 246 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం 247 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కరాచీ కింగ్స్ జట్టు చేతులెత్తేసింది. పెషావర్ బౌలర్ల ధాటికి కేవలం 87 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పెషావర్ బౌలర్లు ఇఫ్తికార్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, సుఫియాన్ ముఖీమ్ తలో మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.