మాజీ మంత్రి అమర్‌నాథ్‌కు 6 నెలల జైలు శిక్ష.. 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు

Visakhapatnam Railway Court sentences Gudivada Amarnath For 6 month
షార్ట్స్‌లో చూడండి
మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌కు విశాఖపట్నం రైల్వే కోర్టు షాక్ ఇచ్చింది. ఎనిమిదేళ్ల క్రితం నమోదైన ఆత్మహత్యాయత్నం కేసులో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ.. ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

విశాఖపట్నంకు ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం అమర్‌నాథ్ 2016 ఏప్రిల్‌లో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. అయితే, ఈ ఘటనపై అప్పటి టూటౌన్ పోలీసులు ఆయనపై ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసుపై విచారణ జరిపిన రైల్వే కోర్టు అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి, అమర్‌నాథ్‌పై నేరం రుజువు కావడంతో శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు.
Go Back to Shorts
Gudivada Amarnath
Gudivada Amarnath jail
Visakhapatnam Railway Zone
Suicide attempt case
YSRCP leader
Andhra Pradesh politics
GVMC Gandhi statue
Hunger strike
Railway court verdict

More Telugu News