యూపీఐకి పదేళ్లు.. లావాదేవీల్లో 12,000 రెట్ల అసాధారణ వృద్ధి

UPI Completes 10 Years Sees 12000x Growth in Transactions
షార్ట్స్‌లో చూడండి
భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఏప్రిల్ 11తో పదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ దశాబ్ద కాలంలో లావాదేవీల పరిమాణంలో 12,000 రెట్లు, విలువ పరంగా 4,000 రెట్లకు పైగా అసాధారణ వృద్ధిని నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.78 కోట్ల లావాదేవీలతో (విలువ రూ. 6,952 కోట్లు) మొదలైన యూపీఐ ప్రస్థానం.. 2025-26 నాటికి 21,898 కోట్ల లావాదేవీలకు (విలువ దాదాపు రూ. 285 లక్షల కోట్లు) చేరింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత డిజిటల్ చెల్లింపుల వినియోగం విపరీతంగా పెరగడంతో యూపీఐ వృద్ధి అమాంతం పెరిగింది. మర్చంట్ క్యూఆర్ కోడ్‌లు, పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ సంఖ్య కూడా భారీగా పెరిగింది.

ఇటీవల మార్చి 2026లో యూపీఐ తన ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ఆ నెలలో ఏకంగా 22.64 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. యూపీఐ ప్రారంభమైనప్పటి నుంచి ఒకే నెలలో ఇన్ని లావాదేవీలు జరగడం ఇదే తొలిసారి. గతేడాది మార్చితో పోలిస్తే ఇది 24 శాతం అధికం.

ప్రస్తుతం ఒక నెలలో జరుగుతున్న యూపీఐ లావాదేవీల విలువ (సుమారు రూ. 28 లక్షల కోట్లు) దేశంలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో దాదాపు 70 శాతానికి సమానంగా ఉండటం గమనార్హం. ఇది నగదుకు ప్రత్యామ్నాయంగా డిజిటల్ చెల్లింపులు ఎంత బలంగా మారాయో స్పష్టం చేస్తోంది.
Go Back to Shorts
UPI
Unified Payments Interface
digital payments
India
UPI transactions
digital economy
QR codes
online payments
NPCI
mobile payments

More Telugu News