మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై రేప్ కేసులో ఊహించని ట్విస్ట్!
పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అత్యాచారం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని బాధితురాలు తొలుత ఫిర్యాదు చేయగా, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. నిందితుడు ఆమెకు స్నాప్‌చాట్ ద్వారా పరిచయమైన ప్రియుడేనని తేలింది.
వివరాల్లోకి వెళితే.. మాచర్లలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న మహిళ, ఈ నెల 2న తనపై అత్యాచారం జరిగిందని పోలీసులను ఆశ్రయించింది. నీళ్లు తాగే నెపంతో ఇంట్లోకి వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ, బాధితురాలి ఫోన్ చాటింగ్ వివరాలను పరిశీలించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
గతంలో ఇద్దరితో వివాహమై విడాకులు తీసుకున్న బాధితురాలు ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు రాజుపాలెం మండలానికి చెందిన నామాల శ్రీనివాస్‌తో స్నాప్‌చాట్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఘటన జరిగిన రోజు బాధితురాలే గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పంపి శ్రీనివాస్‌ను ఇంటికి పిలిచింది. ఇంటికి వచ్చిన శ్రీనివాస్ ఆమెపై బలవంతానికి ప్రయత్నించగా, ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి లోనైన నిందితుడు ఆమెను వివస్త్రను చేసి కాళ్లు, చేతులు కట్టేసి అత్యచారం చేసి పారిపోయాడు.
పరిచయస్తుడే ఈ దారుణానికి పాల్పడ్డాడనే విషయాన్ని దాచిపెట్టి, పోలీసులను తప్పుదోవ పట్టించిందని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడు శ్రీనివాస్‌ను గుర్తించిన పోలీసులు, ఈ నెల 8న మాచర్ల రైల్వే స్టేషన్ వద్ద అతడిని అరెస్ట్ చేశారు. గురువారం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది.