అల్లూరి జిల్లాలో ఘోర విషాదం.. సెల్ఫీ మోజులో జలపాతంలో పడి ముగ్గురు యువతుల మృతి
సెల్ఫీలు, ఫొటోలు తీసుకునే సరదా ముగ్గురు యువతుల ప్రాణాలను బలిగొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘోర విషాద ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదనకు గురిచేసింది. పండుగ సెలవులు కావడంతో సరదాగా గడిపేందుకు జలపాతం వద్దకు వెళ్లిన బాలికలు, విగతజీవులుగా మారడంతో వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది.
వివరాల్లోకి వెళితే.. హుకుంపేట మండలం బుర్జ పంచాయతీ పరిధిలోని జంబవలస గ్రామానికి చెందిన ఐదుగురు యువతులు, పండుగ సెలవుల సందర్భంగా సమీపంలోని ముల్లుంగుమ్మి జలపాతాన్ని చూసేందుకు వెళ్లారు. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఫొటోలు, సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో త్రిష (17), రత్న కుమారి (16), పవిత్ర (16) అనే ముగ్గురు యువతులు జలపాతం మధ్యలో ఉన్న ఓ పెద్ద బండరాయిపైకి ఎక్కారు. అక్కడ ఫొటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నీటి ప్రవాహంలో పడిపోయారు.
వారిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే, నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో వారు కొట్టుకుపోయారు. కొంత సమయం తర్వాత వారి మృతదేహాలను నీటిలో నుంచి వెలికితీశారు. ఈ ఘటనలో మిగిలిన ఇద్దరు అమ్మాయిలు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అందమైన పిక్నిక్ ప్రదేశాలు, సుందరమైన జలపాతాలకు అల్లూరి జిల్లా ప్రసిద్ధి. అయితే, ఇక్కడ తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా, పర్యాటకులు వాటిని పెడచెవిన పెట్టి ప్రమాదకరమైన ప్రదేశాల్లోకి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు పెంచి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.