ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా.. గజ్వేల్‌లో కొనసాగుతున్న బంద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా.. గజ్వేల్‌లో కొనసాగుతున్న బంద్

Gajwel MLA Camp Office Attacked BRS Calls for Bandh
  • గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ శ్రేణులు
  • నిరసనలో పాల్గొన్న వంటేరు ప్రతాప్ రెడ్డి
  • బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గజ్వేల్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఈరోజు గజ్వేల్ బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దుకాణాలు మూతబడ్డాయి. బంద్‌లో భాగంగా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గం ఇంఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. బస్సు డిపో ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గజ్వేల్‌లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
Advertisement
Gajwel
BRS Bandh
Gajwel Bandh
BRS Protest
MLA Camp Office Attack
Vantaru Pratap Reddy

More Telugu News