హైదరాబాద్లో రేడియో టవర్ ఎక్కి కడప యువకుడు హల్చల్
- ప్రియురాలు పెళ్లికి అంగీకరించలేదని, నిరుద్యోగం అంటూ కారణాలు చెప్పిన యువకుడు
- చింతలకుంట ప్రాంతంలో రేడియో టవర్ ఎక్కిన
- డయల్ 100కు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు
- సురక్షితంగా కిందకు దించిన పోలీసులు
జానీ అనే యువకుడు అక్కడి ప్రసార భారతి రేడియో టవర్ ఎక్కి డయల్ 100కు ఫోన్ చేశాడు. తనను ముఖ్యమంత్రితో మాట్లాడించాలని డిమాండ్ చేశాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ, పలు కారణాలు చెబుతున్నాడు. ఆటో గ్యాస్ కోసం ఇబ్బంది అవుతోందని, నిరుద్యోగం, ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదంటూ వివిధ కారణాలు చెప్పాడు. ఎట్టకేలకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతనిని సురక్షితంగా కిందకు దించారు. జానీ ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా తుమ్మలపల్లి గ్రామానికి చెందినవాడు.