Sameer Rizvi: ముంబై బౌలర్లకు చుక్కలు చూపించిన సమీర్ రిజ్వీ... ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. యువ సంచలనం సమీర్ రిజ్వీ (90; 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సులు) మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగడంతో, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. సమీర్ రిజ్వీ ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్ ముందు ముంబై నిర్దేశించిన లక్ష్యం చిన్నబోయింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ, కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైని 162 పరుగులకే పరిమితం చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (51), రోహిత్ శర్మ (35) రాణించినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, ఎంగిడి, నటరాజన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేఎల్ రాహుల్ (1), నితీశ్ రాణా (0) వికెట్లను త్వరగా కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సమీర్ రిజ్వీ, మరో ఓపెనర్ పాతుమ్ నిస్సంక (44)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నిస్సంక ఔటయ్యాక అసలు విధ్వంసం మొదలుపెట్టాడు. ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఒంటిచేత్తో మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పేశాడు.
ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సమీర్ రిజ్వీ చిచ్చరపిడుగులా ఆడాడు. ఆ మ్యాచ్‌లో 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో అజేయంగా 70 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇవాళ కూడా అదే తరహా ఇన్నింగ్స్‌తో చేజింగ్‌లో అదరగొట్టి, తానెంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. సమీర్ విజృంభణకు డేవిడ్ మిల్లర్ (21 నాటౌట్) తోడవడంతో ఢిల్లీ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది.