DC vs MI: సూర్యకుమార్ సారథ్యంలో ముంబై.. టాస్ నెగ్గిన ఢిల్లీ

ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్‌ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

టాస్ గెలిచిన అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. "ఇది మాకు సొంత మైదానంలో మొదటి మ్యాచ్. వికెట్ ఎలా స్పందిస్తుందో చూడాలనుకుంటున్నాం. అందుకే బౌలింగ్ ఎంచుకున్నాం. గత మ్యాచ్‌లో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి గెలవడం మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఎలాంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతున్నాం" అని తెలిపాడు.

ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. "హార్దిక్ ఆరోగ్యం సరిగా లేదు. అందుకే అతని స్థానంలో నేను కెప్టెన్సీ చేస్తున్నాను. మేం టాస్ గెలిచినా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. జట్టులో మూడు మార్పులు చేశాం. హార్దిక్ స్థానంలో దీపక్ చాహర్, బౌల్ట్ స్థానంలో కార్బిన్ బాష్, ఘజన్‌ఫర్ స్థానంలో మిచెల్ శాంట్నర్ జట్టులోకి వచ్చారు" అని వివరించాడు.

తుది జట్లు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నమన్ ధీర్, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్, మిచెల్ శాంట్నర్, కార్బిన్ బాష్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.

ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పతుమ్ నిస్సంక, నితీశ్ రాణా, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, టి. నటరాజన్, ముఖేశ్ కుమార్.
DC vs MI
Suryakumar Yadav
Mumbai Indians
Delhi Capitals
IPL 2026
Hardik Pandya
Axar Patel
Arun Jaitley Stadium
Cricket
Indian Premier League
T20

More Telugu News