అమరావతిపై గవర్నర్ ట్వీట్... చంద్రబాబు స్పందన
- అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం
- ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి విజయమన్న సీఎం చంద్రబాబు
- ప్రజా రాజధాని కల ఇక భద్రంగా ఉందని వ్యాఖ్య
- సీఎం చంద్రబాబుకు, రాష్ట్ర ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అభినందనలు
ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. "చారిత్రక అమరావతి తీర్మానంతో మన ప్రజా రాజధాని కల నెరవేరింది. ఇది మనందరి విజయం" అని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు, ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన గుర్తింపును కల్పిస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించడం చరిత్రాత్మక ఘట్టమని ఆయన అభివర్ణించారు.
చట్టసభల్లో ఈ బిల్లు ఆమోదం పొందడంతో, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టపరమైన బలం చేకూరినట్లయింది. ఈ పరిణామంపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, అమరావతి ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.