F-35 Fighter Jet: ఇరాన్ గడ్డపై కూలిన ఎఫ్-35... పైలట్ ను కాపాడేందుకు అమెరికా విఫలయత్నాలు?
ఇరాన్ గగనతలంలో తమ ఎఫ్-35 ఫైటర్ జెట్ కూలిపోవడంతో, అందులోని పైలట్‌ను కాపాడేందుకు అమెరికా ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని ఇరాన్ మీడియా సంస్థ తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. పశ్చిమ ఇరాన్‌లోని కోగిలుయే, బోయర్-అహ్మద్ ప్రావిన్సులలో అమెరికా దళాలు శుక్రవారం నుంచి గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపింది. బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, సీ-130 హెర్క్యులస్ విమానాలతో గాలిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు వారి ప్రయత్నాలు ఫలించలేదని ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది.
సెంట్రల్ ఇరాన్‌లో తమ అధునాతన రక్షణ వ్యవస్థతో అమెరికాకు చెందిన రెండో ఎఫ్-35 ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) శుక్రవారం ప్రకటించింది. లేకెన్‌హీత్ స్క్వాడ్రన్‌కు చెందిన ఈ యుద్ధ విమానం పూర్తిగా ధ్వంసమై కూలిపోయిందని తెలిపింది. అయితే, దాడి నుంచి తప్పించుకున్న పైలట్ పారాచూట్ సాయంతో ఇరాన్ భూభాగంలోనే ల్యాండ్ అయినట్లు సమాచారం.
పైలట్ బతికే ఉంటాడని భావిస్తున్న అమెరికా, అతడిని ఇరాన్ సరిహద్దుల నుంచి బయటకు తీసుకురావాలని చూస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ పైలట్‌ను ఇరాన్ సైనిక దళాలు ఇప్పటికే అదుపులోకి తీసుకుని ఉండవచ్చని కొన్ని వర్గాలు చెబుతున్నట్లు తస్నిమ్ తన కథనంలో పేర్కొంది.
గత వారం కూడా ఓ అమెరికా ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను, ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించడం తెలిసిందే. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తుండగా, ఇరాన్, దాని మిత్రపక్షాలు కూడా మధ్యప్రాచ్యంలోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై ప్రతిదాడులకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజా ఘటన చోటుచేసుకుంది.