ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక కమాండర్ హదాద్ మృతి

Hamas Commander Izz al Haddad Killed in Israeli Strike
  • హదాద్ మృతి చెందినట్లు ధృవీకరించిన హమాస్
  • 2023లో జరిగిన దాడులకు సంబంధించి సూత్రధారుల్లో ఒకరిగా ఇజ్రాయెల్ వెల్లడి
  • దాడుల్లో భార్య, కుమార్తె మృతి
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలోని హమాస్ సాయుధ విభాగాధిపతి ఇజ్ అల్ హదాద్ మృతి చెందాడు. అతను మృతి చెందినట్లు హమాస్ కూడా ధృవీకరించింది. తాము చేసిన దాడుల్లో హమాస్ కీలక నేత మృతి చెందినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇజ్ అల్ హదాద్ 2023 అక్టోబర్ 7వ తేదీన జరిపిన దాడులకు సూత్రధారుల్లో ఒకరిగా పేర్కొంది. ఈ దాడుల్లో అతడి భార్య, కుమార్తె కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

హమాస్ కీలక నేత మొహమ్మద్ సిన్వర్ మృతి తర్వాత ఆయన బాధ్యతలను హదాద్ తీసుకున్నాడు. ఇజ్రాయెల్ రక్షణ దళాలపై దాడులకు వ్యూహరచన చేయడంలో హదాద్ కీలకంగా వ్యవహరించాడు. యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ సైనికులను పట్టుకోవడంతో పాటు, వారిని తనకు రక్షణ కవచంగా ఉపయోగించుకున్నాడు. హమాస్ స్థావరాల పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు.
Advertisement
Izz al-Haddad
Hamas
Israel
Gaza
Military Commander
Mohammad Sinwar
Israel Defense Forces

More Telugu News