Range Rover: రేంజ్ రోవర్ లగ్జరీ కార్లపై భారీ డిస్కౌంట్.. కోటి రూపాయలకు పైగా తగ్గనున్న ధర!
భారత్-యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ప్రభావంతో లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తమ కార్ల ధరలను గణనీయంగా తగ్గించేందుకు సిద్ధమవుతోంది. ఈ నిర్ణయంతో కొన్ని టాప్-ఎండ్ రేంజ్ రోవర్ మోడళ్ల ధరలు ఏకంగా కోటి రూపాయలకు పైగా తగ్గే అవకాశం ఉంది.
గతేడాది జులైలో భారత్, యూకే మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం.. యూకే నుంచి పూర్తిస్థాయిలో తయారై దిగుమతి అయ్యే కార్లపై (సీబీయూ) దిగుమతి సుంకం మొదటి ఏడాదిలో 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గనుంది. దీనివల్ల బాలీవుడ్ ప్రముఖులు అలియా భట్, రణ్‌వీర్ సింగ్, సోనమ్ కపూర్ వంటి వారు ఎక్కువగా ఇష్టపడే రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఎస్‌వీ ఎడిషన్ల వంటి హై-ఎండ్ వేరియంట్ల ధరలు భారీగా తగ్గనున్నాయి.
నివేదికల ప్రకారం ఈ కార్ల ధరలు 13 నుంచి 25 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఉదాహరణకు ప్రస్తుతం రూ. 2.75 కోట్లుగా ఉన్న రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీ ఎడిషన్ టూ ధర రూ. 2.35 కోట్లకు చేరవచ్చు. అదేవిధంగా రూ. 4.25 కోట్ల విలువైన రేంజ్ రోవర్ 4.4-లీటర్ పెట్రోల్ ఎస్‌వీ మోడల్ ధర రూ. 3.19 కోట్లకు దిగిరావచ్చని అంచనా.
దేశీయంగా అసెంబుల్ చేసే మోడళ్లకు ఈ తగ్గింపు వర్తించదు
అయితే, ఈ ధరల తగ్గింపు కేవలం యూకే నుంచి దిగుమతి చేసుకునే ఎస్‌వీ మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. పూణెలోని ప్లాంట్‌లో విడిభాగాలను (సీకేడీ) తెచ్చి అసెంబుల్ చేసే రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్, వెలార్, డిస్కవరీ స్పోర్ట్ వంటి మోడళ్లపై ఈ ప్రభావం ఉండదు. అలాగే, స్లోవేకియాలో తయారయ్యే డిఫెండర్ మోడల్ ధరలో కూడా మార్పు ఉండదు. ప్రస్తుతం భారత లగ్జరీ కార్ల మార్కెట్‌లో 25 శాతం వాటాను కలిగి ఉన్న జేఎల్‌ఆర్.. ఈ ధరల తగ్గింపుతో మెర్సిడెస్, బీఎండబ్ల్యూ వంటి ప్రత్యర్థి సంస్థలపై పోటీలో మరింత పట్టు సాధించనుంది.