KKR vs SRH: ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన కేకేఆర్.. హైదరాబాద్‌ బ్యాటింగ్

Ajinkya Rahane Wins Toss KKR to Bowl First Against SRH
షార్ట్స్‌లో చూడండి
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే టాస్ గెలిచి, హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్‌పై పచ్చిక ఎక్కువగా ఉండటం, ఇటీవల వర్షాలు కురవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రహానే తెలిపాడు.

టాస్ గెలిచిన అనంతరం రహానే మాట్లాడుతూ.. "సాధారణంగా ఇక్కడ ఇంత పచ్చిక కనిపించదు. ఈ మధ్య వర్షాలు పడ్డాయి. రాత్రి 8 గంటల తర్వాత మంచు ప్రభావం ఉంటుంది. ఈ వికెట్ చాలా బాగుంది. 40 ఓవర్ల పాటు ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాం" అని వివరించాడు. ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ గురించి మాట్లాడుతూ, "అతను చేయాల్సినవన్నీ చేస్తున్నాడు. త్వరలోనే అతడు బౌలింగ్ చేయడం మీరు చూస్తారు" అని స్పష్టం చేశాడు. కోల్‌కతా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని రహానే పేర్కొన్నాడు.

మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. తాము కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని చెప్పాడు. గ‌త మ్యాచ్‌లో చేసిన పొర‌పాట్ల‌ను స‌రిదిద్దుకుని, ఫీల్డ్‌లో ఆటను సరిగ్గా అమలు చేయడంపై దృష్టి పెట్టాలని అన్నాడు. జట్టు కీలక బౌలర్ ప్యాట్ కమిన్స్ పునరాగమనంపై స్పందిస్తూ, "అతని గురించి నాకు ఇంకా స్పష్టత లేదు. కానీ, వీలైనంత త్వరగా జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నాను" అని తెలిపాడు. ఈ మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ ఒక మార్పు చేసింది. ఎడమచేతి వాటం రిస్ట్‌స్పిన్నర్ శివాంగ్ కుమార్‌కు తుది జట్టులో చోటు కల్పించింది.

తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగక్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, బ్లెస్సింగ్ ముజరబానీ, కార్తీక్ త్యాగి.

ఇంపాక్ట్ సబ్స్: ఫిన్ అలెన్, మనీశ్ పాండే, తేజస్వి సింగ్, సౌరభ్ దూబే, రోవ్‌మన్ పావెల్.

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, సలిల్ అరోరా, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, డేవిడ్ పేన్, జయదేవ్ ఉనద్కత్.

ఇంపాక్ట్ సబ్స్: హర్షల్ పటేల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఇషాన్ మలింగ, ఆర్ స్మరన్, షకీబ్ హుస్సేన్.


Go Back to Shorts
KKR vs SRH
Ajinkya Rahane
KKR
Kolkata Knight Riders
SRH
Sunrisers Hyderabad
IPL 2024
Indian Premier League
Eden Gardens
Ishan Kishan
Cricket

More Telugu News