Chandrababu: ఇక అమరావతికి తిరుగులేదు.. రాష్ట్రానికి కొత్త శకం మొదలైంది: సీఎం చంద్రబాబు
రాజ్యసభలో గురువారం అమరావతి బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రక, నిర్వచనాత్మక ఘట్టమని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. అమరావతికి తిరుగులేదని, అది ఆంధ్రప్రదేశ్ హృదయమని, భవిష్యత్తులో దేశానికే గర్వకారణంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ఒక పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026 పార్లమెంట్ ఉభయ సభల్లో ఏకగ్రీవంగా ఆమోదం పొందడం ద్వారా ప్రజల సమష్టి ఆకాంక్షలకు జాతీయ స్థాయిలో బలమైన గొంతుక లభించిందని చంద్రబాబు పేర్కొన్నారు. "రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ అనేక సవాళ్లు, అనిశ్చితులను ఎదుర్కొంది. ఈ క్లిష్ట సమయంలో అమరావతి రైతులు చేసిన అసమానమైన త్యాగం, చూపిన విశ్వాసం, కనబరిచిన ధైర్యమే ఈ కలను సజీవంగా నిలిపాయి. ఈ చారిత్రక విజయం వారికే అంకితం," అని ఆయన అన్నారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రానికి దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న స్థిరత్వం లభించిందని, ప్రతి పౌరుడికి సాధికారత, ఆత్మవిశ్వాసం, ప్రగతితో కూడిన కొత్త శకానికి నాంది పలికిందని తెలిపారు. "అమరావతి రాజధాని హోదా ఇప్పుడు ఎలాంటి సందేహాలకు, చర్చలకు, మార్పులకు తావులేకుండా పటిష్టంగా స్థిరపడింది" అని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆకాంక్షలకు అండగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చంద్రబాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 2015 అక్టోబర్ 22న అమరావతికి శంకుస్థాపన చేసిన నాటి నుంచి, 2025 మే 2న దాని పురోగతికి పునరుజ్జీవం పోసే వరకు ప్రతి కీలక దశలోనూ ప్రధాని మోదీ అమరావతికి అండగా నిలిచారని కొనియాడారు. ఈ బిల్లు ముందుకు సాగడంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. విభేదాలను పక్కనపెట్టి అమరావతిని ఏకైక 'ప్రజా రాజధాని'గా పునరుద్ఘాటించిన అన్ని పార్టీలు, పార్లమెంట్ సభ్యులకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
గురువారం రాజ్యసభలో ఈ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు సభాధ్యక్షులు సి.పి. రాధాకృష్ణన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్డీయే సభ్యులు హర్షధ్వానాలు చేశారు. దీంతో అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా చట్టబద్ధమైన గుర్తింపు పొందింది.